కరోనాపై పోరుకు హలో యాప్ రూ.7కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-10T23:23:26+05:30 IST

సరికొత్త సోషల్ మీడియా వ్యవస్థ హలో కరోనాపై పోరాడేందుకు తనవంతు కృషి చేస్తోంది. గివ్ ఇండియా, యాక్షన్ ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థలతో...

కరోనాపై పోరుకు హలో యాప్ రూ.7కోట్ల విరాళం

న్యూఢిల్లీ: సరికొత్త సోషల్ మీడియా వ్యవస్థ హలో కరోనాపై పోరాడేందుకు తనవంతు కృషి చేస్తోంది. గివ్ ఇండియా, యాక్షన్ ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థలతో కలిసి ‘మైభీ కోవిడ్ వారియర్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా దాదాపు 20,000 కుటుంబాలకు అండగా నిలవనుంది. రోజువారీ కూలీలు, కార్మికుల కుటుంబాలకు నెల రోజులపాటుకు సరిపడా నిత్యావసర సరుకులు, శానిటైజేషన్ కిట్స్‌ను సరఫరా చేయనుంది. దీనికోసం హలో సంస్థ రూ.5కోట్లు విరాళంగా ప్రకటించింది.  అంతేకాకుండా పీఎం కేర్స్ ఫండ్‌కు, మహారాష్ట్ర సీఎం నిధికి కలిపి మరో రూ.2కోట్లు విరాళంగా ప్రకటించింది.


కోవిడ్-19 మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రజల్లో ధైర్యం నింపేందుకు, స్ఫూర్తి కలిగించేందుకు హలో యాప్ జస్ట్ మ్యూజిక్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌లతో కలిసి ‘ముస్కురాయేగా ఇండియా’ అనే మ్యూజిక్ వీడియోను రూపొందించింది.  పలువవురు సెలబ్రిటీలు ఈ వీడియోలో నటించారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, కృతి సనన్, కార్తీక్ ఆర్యన్, తాప్సీ పన్ను, కియారా అడ్వాణి, అనన్య పాండే, శిఖర్ ధవన్ వంటి ఎంతోమంది నటులు ఈ మ్యూజిక్ వీడియోలో కనిపించనున్నారు. దీనికి విశాల్ మిశ్రా కంపోజింగ్ చేయగా ఇటీవలే విడుదల చేశారు. కరోనాపై హలో చేస్తున్న పోరుకు ఇతర సెలబ్రిటీలు కూడా తమ మద్దతు తెలుపుతున్నారు. గివ్ ఇండియాలో భాగస్వాములవ్వాలని ప్రజలను కోరుతూ హలో యాప్‌లోని తమ ఖాతాల్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల మరికొంత మంది పేదలకు నిత్యావసర వస్తువులను అందజేసేందుకు ప్రజలు ముందుకు వస్తారని వారు అభిప్రాయపడుతున్నారు.


కరోనాపై సమగ్ర సమాచారం..

 ‘#ఫైట్అగైనెస్ట్ కరోనా వైరస్’ పేరుతో హలో ఒక పేజీ ఏర్పాటు చేసింది. దీని ద్వారా దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించిన నిర్దిష్టమైన సమాచారాన్ని అందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖల నుంచి వివరాలు సేకరించి వాటిని 14 భాషల్లో తర్జుమా చేసి కచ్చితమైన అప్‌డేట్స్ అందిస్తోంది. 


సీఎంలు, ప్రజలకు అనుసంధానంగా..

హలో లైవ్ స్ట్రీమింగ్‌ ద్వారా కేరళ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ల ముఖ్యమంత్రులు కోవిడ్-19తో పోరాడటానికి  అవసరమైన సమాచారాన్ని, సూచనలును ప్రజలకు అందజేస్తున్నారు.


మీరు హలో ఆప్‌ క్యాంపెయినింగ్‌లో భాగస్వాములవ్వాలనుకుంటే  www.helo-app.com లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని మీ వంతు సాయం చేయండి.

Updated Date - 2020-04-10T23:23:26+05:30 IST