‘జవాద్‌’ కారణంగా పలు Trains రద్దు

ABN , First Publish Date - 2021-12-03T17:56:35+05:30 IST

‘జవాద్‌’ తుఫాన్‌ కారణంగా నైరుతి రైల్వేజోన్‌ పరిధిలోని పలు రైళ్ళు రద్దయ్యాయి. ఈ మేరకు నగరంలో జోన్‌ ప్రజాసంబంధాల విభాగం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు కంటోన్మెంట్‌ నుంచి గౌహతికి

‘జవాద్‌’ కారణంగా పలు Trains రద్దు

బెంగళూరు: ‘జవాద్‌’ తుఫాన్‌ కారణంగా నైరుతి రైల్వేజోన్‌ పరిధిలోని పలు రైళ్ళు రద్దయ్యాయి. ఈ మేరకు నగరంలో జోన్‌ ప్రజాసంబంధాల విభాగం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు కంటోన్మెంట్‌ నుంచి గౌహతికి బయల్దేరాల్సిన నెం 12509 రైలు గురువారం రద్దయింది. శుక్రవారం యశ్వంతపురం నుంచి బయల్దేరాల్సిన నెం. 12246 దురంతో ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు సిటీ నుంచి బయల్దేరాల్సిన నెం 18464 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, యశ్వంతపురం నుంచి బయల్దేరాల్సిన హౌరా డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దయ్యాయని  ప్రకటనలో పేర్కొన్నారు.


వాల్తేరు డివిజన్‌లో శుక్రవారం (3న) రద్దయిన రైళ్లు:

పూరి-గుణుపూర్‌ (18417), భువనేశ్వర్‌-రామేౄశ్వరం (20896), హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నూమా (12703), పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్‌ (22883), హౌరా-యశ్వంత్‌పూర్‌ దురంతో (12245), భువనేశ్వర్‌-ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), పురులియా-విల్లుపురం (22605), పూరి-తిరుపతి (17479), హౌరా-హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (180 45), హౌరాచెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), హౌరా-మైసూరు (22817), సంత్రాగచ్చి-చెన్నై (22807), డిఘా-విశాఖ (22873), హౌరా-యశ్వంత్‌పూర్‌ (12863), హౌరా-చెన్నై మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12839), పాట్నా-ఎర్నాకులం (22644), రాయగడ-గుంటూరు (17244), సంబల్‌పూర్‌-నాందేడు (20809), కూర్బా-విశాఖపట్నం (18517), ధన్‌బాద్‌-అలెప్పీ (13351), టాటా-యశ్వంత్‌పూర్‌ (12889), పూరి-అహ్మదాౄబాద్‌ (12843), భువనేశ్వర్‌-జగదల్‌పూర్‌ (18447), చెన్నై-హౌరా (12842), హైదరాబాద్‌-హౌరా (180 46), చెన్నై-భువనేశ్వర్‌ (12849), యశ్వంత్‌పూర్‌-హౌరా దురంతో (12864), సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ (12704), తిరుపతి-పూరి (17480), యశ్వంత్‌పూర్‌-హౌరా (12864), సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016), చెన్నై-హౌరా మెయిల్‌ (12840), వాస్కోడిగామా-హౌరా (18048), తిరుచురాపల్లి-హౌరా (12664), బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18464), ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019), విశాఖ-కూర్బా (18518), విశాఖ-రాయగడ (18528), గుంటూరు-రాయగడ (17243), జగదల్‌పూర్‌-భువనేశ్వర్‌ (18448), జునాగర్‌రోడ్డు-భువనేశ్వర్‌ (20838), విశాఖ-భువనేశ్వర్‌ (22820), విశాఖ-పలాస (18532), సత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా (22832), బెంగళూరు-అగర్తాలా (02983), అగర్తాలా-సికింద్రాబాద్‌ (07029) 

Updated Date - 2021-12-03T17:56:35+05:30 IST