Abn logo
Jul 16 2020 @ 08:06AM

ముంబైలో భారీవర్షాలు...రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై నగరంతోపాటు సమీప జిల్లాల్లో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురవవచ్చని ముంబైలోని వాతావరణ కేంద్రం గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ముంబై నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బాండ్రా కుర్లా కాంప్లెక్సులో 201 మిల్లీమీటర్లు, కొలాబాలో 152 మిల్లీమీటర్లు, శాంతాక్రజ్ లో 159.7 మిల్లీమీటర్లు, మహాలక్ష్మి ప్రాంతంలో 129 మిల్లీమీటర్లు, రాంమందిర్ ప్రాంతంలో 130మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. భారీవర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని, సముద్ర తీరప్రాంతాలకు వెళ్లవద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోరారు. దాదర్, సియాన్, హింద్ మాత, జోగేశ్వరి ప్రాంతాల్లో వర్షపునీరు నిలచింది. లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.    

Advertisement
Advertisement
Advertisement