Delhi పరిసర ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో గాలివాన

ABN , First Publish Date - 2022-05-23T12:36:07+05:30 IST

ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు,మెరుపులతో కూడిన గాలివాన కురుస్తోంది. ...

Delhi పరిసర ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో గాలివాన

ఐఎండీ హెచ్చరిక జారీ 

న్యూఢిల్లీ: ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు,మెరుపులతో కూడిన గాలివాన కురుస్తోంది. సోమవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాలలో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు ఉరుములతో కూడిన తుపాన్ కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది.భారీవర్షం వల్ల ఢిల్లీలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది. సోమవారం భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి లోపలే ఉండాలని,బయటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. కిటికీలు, తలుపులు మూసివేయాలని,వీలైతే ప్రయాణాలను నివారించాలని ఐఎండీ కోరింది. ప్రజలు చెట్ల కింద తలదాచుకోవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఐఎండీ సూచించింది.


కాంక్రీట్ అంతస్తులపై పడుకోవద్దని, కాంక్రీట్ గోడలకు ఆనుకొని ఉండవద్దని, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అన్‌ప్లగ్ చేయాలని ఐఎండీ తెలిపింది. గాలివాన వల్ల కచ్చాఇళ్లు, గోడలు, గుడిసెలు పడిపోతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.భారీవర్షాల వల్ల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. 


Updated Date - 2022-05-23T12:36:07+05:30 IST