కుండపోత

ABN , First Publish Date - 2022-08-08T05:55:09+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ మండలాల్లో కుండపోతగానే వర్షాలు కురు స్తున్నాయి.

కుండపోత
రాజవరం ఎర్రకాల్వ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరదనీరు

 ఏజెన్సీలో భారీ వర్షాలు

 పొంగిన వాగులు.. కూలిన చెట్లు

 బుట్టాయగూడెంలో అత్యధికంగా   81.4 మి.మీ వర్షపాతం 


ఏలూరుసిటీ, ఆగస్టు 7: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ మండలాల్లో కుండపోతగానే వర్షాలు కురు స్తున్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాం తంలో కొన్ని వాగులు పొంగినా తర్వాత శాంతించాయి. గడచిన 24 గంటల్లో బుట్టాయి గూడెం మండలంలో 81.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవగా సరాసరి 21.7 మి.మీ నమోదైంది. బుట్టాయిగూడెంలో అత్యధికంగా 81.4 మి.మీ నమోదైంది.  బుట్టాయగూడెంలో కురిసిన భారీ వర్షానికి ఆదివారం ఉదయం జంగారెడ్డిగూడెం , కొయ్యలగూడెం మండలంలో వాగులు పొంగాయి. రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడినా ఆ తర్వాత  శాం తించాయి. ఎర్రకాలువ ఉధృతంగానే ప్రవహిస్తోంది. కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం నుంచి దిగువకు 2098 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం పూర్తిస్థాయి సామర్ధ్యం 4.428 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజె క్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 81.81 మీటర్లు ఎత్తులో ఎర్ర కాలువ ప్రవహిస్తోంది.   


 రాబోయే రెండు రోజుల్లో వర్షాలు

జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చ రికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా కోస్తా జిల్లాల్లో వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొయ్యలగూడెంలో 78.6 మిల్లీమీటర్లు, జీలుగు మిల్లిలో 52.2, జంగా రెడ్డిగూడెంలో 45.4, టి.నరసాపురంలో 40.6, ఉంగుటూరులో 39.6, కుక్కు నూరు, చింతల పూడిలో 33.4, వేలేరు పాడులో 32.2, భీమడోలులో 26.2, ద్వారకా తిరుమలలో 25.2, కామవరపుకోటలో 24.4, లింగపాలెంలో 19.8, చాట్రాయిలో 19.8, మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిగిలిన మండలాల్లో 10 మి.మీ కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైంది. 


రాజవరం వంతెనపైకి వరదనీరు

కొయ్యలగూడెం : కొయ్యలగూడెం మండలం రాజవరం ఎర్రకాల్వ వంతెనపై నుంచి వరదనీరు ప్రవహిస్తున్నది. వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రకాల్వ జలాశయం నిండిపోవడంతో మూడు వేల క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఆదివారం సాయంత్రానికి వరదనీరు ఉధృ తంగా ప్రవహించటంతో వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. సుమారు అడుగు ఎత్తులో నీరు ప్రవహించడంతో రాకపోకలకు ిఇబ్బంది కలుగుతోంది. కొయ్యలగూడెం నుంచి ద్వారాకా తిరుమలకు వెళ్లడానికి అదే ప్రధాన రహదారి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందు తున్నారు. ఎర్రకాల్వ జలాశయం నుంచి మరింత నీటిని విడుదల చేస్తే పంట పొలా లకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పోలీసు, రెవెన్యూ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. 


  ఏజెన్సీలో పొంగిన వాగులు 

బుట్టాయగూడెం : ఏజెన్సీ ప్రాంతంలో శని వారం అర్ధరాత్రి దాటక భారీవర్షం కురిసింది. భారీవర్షం కారణంగా కొండవాగులు పొంగి ప్రవ హించాయి. భారీవర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో దొరమామిడి పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా తాటిచెట్లు, చింతచెట్లు విరిగి పడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం రాత్రి పడిన చెట్లను ఆర్‌అండ్‌ బీ అధికారులు ఆదివారం సాయంత్రం తొలగించే వరకు నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు. కుండపోత వర్షంతో జల్లేరు, బైనేరు, రెడ్డిగణపవరం వాగులు పొంగి ప్రవహించాయి. ఆదివారం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. 


మునిగిపోయిన ఎద్దువాగు వంతెన

వేలేరుపాడు  : గోదావరి నది ఎగువ భాగాన ఉన్న ప్రాజెక్ట్‌లలో కనిష్ట స్థాయిలోనే నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 27 అడుగులు మాత్రమే నీటి మట్టం ఉండగా ముంపు మండలాలకు మాత్రం వరద ముంపు పొంచే ఉంది. పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా వరద నీరు వెనక్కి మళ్లుతూ లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. వేలేరుపాడు– కొయిదా రహదారి మద్య ఎద్దు వాగు వంతెన నీట మునిగిపోయింది. దీని కారణంగా దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. ముంపు మండలాల ప్రజలను ఒక వైపు పోలవరం బ్యాక్‌ వాటర్‌ కలవర పెడు తుండగా ఈనెల 9వ తేదీ వరకు తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిం చడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అప్ర మత్తం చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం భారీ వర్షాలు కురిస్తే వరద నీరు మొత్తం గోదావరికి పోటెత్తి మరోసారి వరదలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 10వ తేదీ నుంచి మండలాన్ని ముంచెత్తిన వరదలు క్రమేపీ తగ్గడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రామాలకు తిరిగి వెళ్లేందుకు సమా యత్తం అవుతున్నారు. అయితే వర్షాల భయంతో వెళ్లాలా వద్దా అనే సంకట స్ధితిలో ప్రజలు ఉన్నారు.




Updated Date - 2022-08-08T05:55:09+05:30 IST