Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పల్లపు ప్రాంతాలు జలమయం

twitter-iconwatsapp-iconfb-icon
పల్లపు ప్రాంతాలు జలమయంవీరవాసరం మండలంలో నారుమడులోని నీటిని తోడుతున్న రైతులు

కాళ్ళ / మొగల్తూరు / వీరవాసరం, జూన్‌ 28: జిల్లాలో పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాళ్ళ మండలంలో భారీ వర్షానికి రహదారులు చెరువులు, కాలువలు తలపించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్ధ సక్రమంగా లేకపోవడం వల్ల స్ధానికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా కాళ్ళలోని పల్లపు వీధి వర్షంనీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడటంతో పంచాయితీ సిబ్బంది నీరు మళ్ళీంచే ఏర్పాట్లు చేశారు. దొడ్డనపూడి, కాళ్ళకూరు, జక్కరంతో పాటు బొండాడపేట తదితర గ్రామాల్లో సర్పంచ్‌లు, అధికారులు వర్షపు నీటిని మళ్లించే చర్యలు చేపట్టారు. పాలకొల్లు హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఎల్‌ఆర్‌పేట, వెలమగూడెం, కొత్తపేట కొత్తకాలనీ, క్రిస్టియన్‌పేట, రాజీవ్‌నగర్‌కాలనీ, చిత్రాయి చెరువు గట్లు, లక్ష్మీనగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షానికి డ్రైయినేజీలు పొంగి పొర్లాయి. పల్లపు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. యలమంచిలి మండలంలో రహదారులు జలమయం అయ్యాయి. చించినాడ – ఏనుగువానిలంక, మేడ పాడు – నేరేడుమిల్లి, మేడపాడు – పెనుమర్రు, సీతమ్మచెరువు – కాంబొట్ల పాలెం రహదారి గోతుల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు వాహనదా రులు అవస్థలు పడ్డారు. వీరవాసరం మండలంలో భారీ వర్షాలకు నారుమడులు నీట మునిగాయి. నారుమడులను కాపాడేందుకు రైతులు నీటిని తోడడం, రాత్రి పూట వర్షంతో మునగడం మూడు రోజులుగా సాగుతోంది. మరోపక్క భారీ వర్షంతో నారుమడులు వేయడానికి రైతులు సిద్ధపడుతున్నారు. బాలేపల్లి, వీరవాసరం, దూసనపూడి ఆయకట్టులో నారుమడులు నీటమునిగాయి. ఉండి, పెనుగొండ మండలాల్లో రహదారులు, పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రెయిన్లలో నీరు రోడ్డుపై చేరింది. మొగల్తూరు మండలంలో పలు గ్రామాల్లో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు అనేక ఇబ్బందులు పడ్డారు. మొగల్తూరు – భీమవరం రహదారి పెద్ద గొల్లగూడెం వద్ద నీట మునిగింది. కొత్తకాయలతిప్పలో నివాసాల వద్ద నీరు నిలిచిపోవడంతో వార్డు సభ్యుడు లక్కు రాంబాబు సొంత ఖర్చుతో కూలీలను ఏర్పాటు చేసి బోదెలు తవ్వించారు. మసీదు సెంటర్‌, గాంధీబొమ్మల సెంటర్‌ సత్తెమ్మ గుడి వీధి, ఉన్నత పాఠశాల, వడయార్‌పేట, భవానీ కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో సర్పంచ్‌ పడవల మేరీ సత్యనారాయణ, ఉప సర్పంచ్‌ బోణం నర్సింహరావు జేసీబీతో కచ్చా డ్రెయిన్లు తవ్వించారు. ఇంజేటివారిపాలెం, గొల్లగూడెం గ్రామాల్లో నారు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పల్లపు ప్రాంతాలు జలమయంఆకివీడు రైల్వేగేటు సమీపంలో గోతుల రహదారి


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.