Abn logo
Apr 16 2021 @ 23:22PM

రావికమతంలో భారీ వర్షం

రావికమతం, ఏప్రిల్‌ 16: మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములతో సుమారు గంట పాటు వాన పడింది. రావికమతం, కొత్తకోట, మరుపాక తదితర గ్రామాల్లో ఏదధాటిగా కురిసిన వర్షానికి రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షం వేసవి పంటలకు ఎంతగానో ఆసరాగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అలాగే 20 రోజులుగా భానుడు ఉగ్రరూపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది.

అలాగే రోలుగుంట మండల కేంద్రంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. వారం రోజులుగా తీవ్ర వడగాల్పులతో అవస్థలు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. మెట్ట ప్రాంతాల్లో కూరగాయలు, వేసవి పంటలకు వర్షం ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Advertisement
Advertisement
Advertisement