మైదుకూరులో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-10-21T04:53:51+05:30 IST

మైదుకూరులో బుధవారం మధ్యాహ్నం కొద్ది సేపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

మైదుకూరులో భారీ వర్షం
యల్లంపల్లెకు వద్ద రోడ్డుకు అడ్డుగా పడ్డ చెట్లు

మైదుకూరు, అక్టోబరు 20: మైదుకూరులో బుధవారం మధ్యాహ్నం కొద్ది సేపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు దుకాణాల వద్ద ఏర్పాటు చేసుకున్న రేకులు, బ్యానర్లు కొట్టుకుపోయాయి. యల్లంపల్లె పరిసర ప్రాంతాల్లో లోతట్టు వీధులు జలమయం కావడంతో దాదాపు 10 విద్యుత్‌ స్తంభాలు, రెండు ట్రాన్స్‌ఫార్మర్లు కింద పడ్డాయి. అలాగే పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. కాగా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. 



Updated Date - 2021-10-21T04:53:51+05:30 IST