భారీగా పంటనష్టం

ABN , First Publish Date - 2022-08-06T05:29:27+05:30 IST

భారీగా పంటనష్టం

భారీగా పంటనష్టం
పరిగి మండలం సయ్యద్‌ మల్కాపూర్‌లో నీటిలో పత్తి చేనును చూపుతున్న రైతు

  • వర్షాలతో అతలాకుతలం..  పొంగిన వాగులు

పరిగి/తాండూరు రూరల్‌/దోమ, ఆగస్టు 5: పరిగి సబ్‌ డివిజన్‌లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. గురువారం నాటి వర్షాని కి వాగులు, వంకలు పొంగి పొలాల్లోకి నీరు చేరింది. మొ లకలు కుళ్లిపోతున్నాయి. ఈ సారి అధిక వర్షాలతో పంటల ఆరంభంలో నష్టాలపాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిగి మండలంలో 1,150 ఎకరాల్లో పత్తి, 250ఎకరాల్లో కంది పంటలకు నష్టం జరిగింది. పూడూరు మండలంలో నాలుగు వేల ఎకరాల్లో, దోమలో 3వేల ఎకరాలు, కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల్లో 3,500 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ఈ మేరకు వ్యవసాయ అధికారులు నష్టాల వివరాలను ఉన్నతాధికారులు పంపించారు. తాండూరు మండలంలోని మల్కాపూర్‌, కోట బాస్ప ల్లి, ఐనెల్లి, అల్లాపూర్‌, బెల్కటూర్‌ గ్రామాల సరిహద్దు ల్లో నదులు ప్రవహించి రాకపోకలు స్తంభించాయి. గురువారం రాత్రి 9గంటలకు నదుల్లో ప్రవాహం తగ్గడంతో ప్రయాణికులు రాత్రి10 గంటలకు ఇళ్లకు చేరుకున్నారు. మల్కాపూర్‌లో సర్పంచ్‌ విజయలక్ష్మి, ఎంపీటీసీ రవిసింధే భవానీ కాలనీలో నీట మునిగిన ఇళ్ల బాధితులను పరామర్శించారు. తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు ఆదేశాల మేరకు పంచాయతీ అధికారి రతన్‌సింగ్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజిరెడ్డి శుక్రవారం గ్రా మానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శులు మోన్యానాయక్‌, లాలప్ప, ఉపసర్పంచ్‌ ఉన్నారు. దోమతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి దోమ పెద్ద చెరువు అలుగు పారింది. బాసుపల్లి-గొడుగోనిపల్లి మధ్య కుక్కలవాగు ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. ప్రయాణికుల రాకపోకలకు ఇ బ్బందులు పడ్డారు. వర్షానికి మొలకల దశల్లోని పంటలు దెబ్బతిన్నాయి. 


  • దిర్సంపల్లి వాగులో వ్యక్తి గల్లంతు 

వాగు దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. దోమ మండలం దిర్సంపల్లికి చెం దిన జావిద్‌(55) శుక్రవారం మధ్యాహ్నం కుటుంబీకులతో  కలిసి పొలం పనులు చే సుకుంటున్నాడు. ట్రాక్టర్‌ రాడ్‌ తీసుకురావడానికని వాగు అవతలి ఒడ్డుకు వెళ్లాడు. చాలా సమయం దాటినా రాకపోవడంతో కుటుంబీకులు వెళ్లి చూడగా వాగు ఒడ్డున చెప్పులు, బట్టలు కనిపించాయి. జావిద్‌ వాగు లో కొట్టుకుపోయి ఉంటాడని కుటుంబీకులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చి వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీస్‌, రెవెన్యూ అధికారులకు తెలిపారు. వారొచ్చి సాయంత్రం వరకు వెతికినా జావిద్‌ ఆచూకీ లభించలేదు.


  • వాగులో కొట్టుకుపోయి జోడెడ్ల మృత్యువాత

వికారాబాద్‌: మండలంలోని గొట్టిముక్లలో రైతు మాక్యం వెంకటయ్యకు చెందిర రెండు ఎద్దులు గురువారం సాయంత్రం వాగులో కొట్టుకుపోయాయి. శుక్రవారం మాణిక్యరెడ్డి పొలం వద్ద ఎద్దుల కళేబరాలను గుర్తించారు. దీంతో రైతు వెంటయ్య వాటిని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. సాగు కోసం అప్పుచేసి కొన్ను ఎడ్లు చనిపోయాయని రోదించాడు. ప్రభుత్వం తనకు సాయం చేసి చేయాలని రైతు కోరాడు.

Updated Date - 2022-08-06T05:29:27+05:30 IST