రైతులపై పెనుభారం : తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-03-03T04:38:13+05:30 IST

ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు సతమతమవుతుంటే బీజేపీ ప్రభుత్వం పుండుమీద కారం చల్లినట్లు ఎరువుల ధరలు పెంచాలని నిర్ణయించడం గర్హనీయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

రైతులపై పెనుభారం : తులసిరెడ్డి

వేంపల్లె, మార్చి 2: ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు సతమతమవుతుంటే బీజేపీ ప్రభుత్వం పుండుమీద కారం చల్లినట్లు ఎరువుల ధరలు పెంచాలని నిర్ణయించడం గర్హనీయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 50 కిలోల రసాయన ఎరువుల బస్తాపై రూ.100 నుంచి రూ.250 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయించడం శోచనీయమన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు పెంచాయని, మరికొన్ని కంపెనీలు ఏప్రిల్‌ 1 నుంచి పెంచేందుకు సిద్ధమయ్యాయన్నారు. రైతులు ట్రాక్టర్లకు వాడే డీజల్‌ ధర విపరీతంగా పెరగడంతో ట్రాక్టర్లు వాడాలంటే భయపడుతున్నారన్నారు. వంటగ్యాస్‌ ధర విపరీతంగా పెరిగినందున ప్రజలందరితో పాటు రైతు కుటుంబాలపై కూడా అదనపు ఆర్థికభారం పడిందన్నారు.

Updated Date - 2021-03-03T04:38:13+05:30 IST