భారత్ నుంచి అదనపు విమానాల రాకపోకలకు బ్రిటన్ నో !

ABN , First Publish Date - 2021-04-23T00:26:05+05:30 IST

భారత్ నుంచి అదనపు విమానాల రాకపోకలకు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నిరాకరించింది. గురువారం

భారత్ నుంచి అదనపు విమానాల రాకపోకలకు బ్రిటన్ నో	!

లండన్: భారత్ నుంచి అదనపు విమానాల రాకపోకలకు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నిరాకరించింది. గురువారం ఇండియా నుంచి వచ్చే 8 అదనపు ప్రత్యేక విమానాల ల్యాండింగ్‌కు అనుమతించాల్సిందిగా నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి వచ్చిన అభ్యర్థనను తిరస్కరించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో  బ్రిటన్ రేపటి (శుక్రవారం) నుంచి ‘రెడ్‌లిస్ట్’ ట్రావెల్ బ్యాన్‌ను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత విమానాలకు అనుమతి నిరాకరించింది. ఒత్తిళ్లు తీవ్రతరం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అదనపు విమానాల కోసం వచ్చిన అభ్యర్థనను తిరస్కరించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు.  


ఇండియా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 103 మందిలో భారత్‌లో వెలుగు చూసిన కరోనా వేరియంట్‌ను గుర్తించారు. దీంతో ఇండియాను ట్రావెల్ ‘రెడ్‌లిస్ట్‌’లో చేర్చింది. దీని ప్రకారం ఇండియాలో గత పది రోజులుగా ఉన్న ఉన్న యూకే/ఐరిష్, బ్రిటిష్ పౌరులు యూకేలో ప్రవేశించడానికి అనుమతి లేదు. అలా వచ్చే వారు పది రోజులపాటు పూర్తిగా హోటల్ క్వారంటైన్‌లో ఉండాలి.

Updated Date - 2021-04-23T00:26:05+05:30 IST