కన్నీరు పెట్టిస్తున్న ఫొటోకు ఫస్ట్ ప్రైజ్!

ABN , First Publish Date - 2020-10-11T22:20:31+05:30 IST

అవి గజరాజులు..గాంభీర్యానికి ప్రతికలు. కానీ ప్రస్తుతం వాటి పరిస్థితి వీధి కుక్కలకంటే హీనంగా మారిపోయింది. చెత్త కుప్పల్లో ఆహారం వెత్తుకోవాల్సిన దీనస్థితికి చేరుకున్నాయి. శ్రీలంకలోని కినిపించిన దృశ్యం ఇది. తిలక్షణ్ ధర్మపాలన్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. హృదాయాన్ని కలచి వేసే ఈ దృశ్యానికి బ్రిటన్‌ రాయోల్ సోసైటీ ఆఫ్ బయాలజీ నిర్వహించిన పోటీలో తొలి బహుమతి లభించింది.

కన్నీరు పెట్టిస్తున్న ఫొటోకు ఫస్ట్ ప్రైజ్!

లండన్: అవి గజరాజులు..గాంభీర్యానికి ప్రతీకలు. కానీ ప్రస్తుతం వాటి పరిస్థితి వీధి కుక్కల స్థాయికి చేరుకుంది. చెత్త కుప్పల్లో ఆహారం వెతుక్కోవాల్సిన దుస్థితి ప్రాప్తించింది. శ్రీలంకలోని కినిపించిన దృశ్యం ఇది. తిలక్షణ్ ధర్మపాలన్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. హృదాయాన్ని కలచి వేసే ఈ ఫొటోకు.. బ్రిటన్‌ రాయోల్ సోసైటీ ఆఫ్ బయాలజీ నిర్వహించిన పోటీలో తొలి బహుమతి లభించింది. ‘మారుతున్న ప్రపంచం’ పేరిట రాయల్ సొసైటీ ఈ పోటీని నిర్వహించింది.  


కాగా.. ఈ హృదయవిదారక దృశ్యాలు అక్కడి అలువిల్ ప్రాంతంలోనివి. చెత్త కుప్పలు పర్వాతాలు అంత ఎత్తుకు పెరిగి అక్కడి అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయని, దీంతో గజరాజుల సమూహాం తరచూ చెత్త కుప్పల్లో ఆహారం వెతుక్కొంటున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఏనుగులు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృత్యువాత పడ్డాయని చెబుతున్నారు. అయితే..ఈ సమస్యకు స్థానిక అధికారులు ఇప్పటి వరకూ పరిష్కారం కనుగొనలేదని తిలక్షణ్ ధర్మపాలన్ వాపోయారు.

Updated Date - 2020-10-11T22:20:31+05:30 IST