Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లలు రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే...

ఆంధ్రజ్యోతి(18-10-2021)

పిల్లలు యాక్టివ్‌గా ఉండాలంటే వాళ్లకు మంచి ఆహారం అందించాలి. డైట్‌ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా చూసుకోవాలి. మంచి ఆహారం పిల్లల మూడ్‌పై కూడా ప్రభావం చూపుతుంది. పిల్లలు సంతోషంగా, ఎనర్జిటిక్‌గా ఉండటానికి ఈ ఆహారం ఉపయోగపడుతుంది.


వేపుడు పదార్థాలు, ఆయిల్‌ ఫుడ్‌కు బదులుగా ఫైబర్‌ ఎక్కువగా ఉండే బార్లీ, ఓట్‌మీల్‌, బక్వీట్‌, మిల్లెట్స్‌, పాస్తా వంటి తృణధాన్యాలను అందించాలి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పిల్లల మూడ్‌ను బూస్ట్‌ చేస్తాయి.

పిల్లలు ఎప్పుడూ డీహైడ్రేట్‌ కాకూడదు. అందుకే నీళ్లు ఎక్కువగా తాగేలా చూడటంతో పాటు పుచ్చకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లు ఎక్కువగా అందించాలి.

బ్రేక్‌ఫా్‌స్టగా ఓట్‌మీల్‌ను అందించాలి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.

పిల్లలు ఉత్సాహంగా ఉండాలంటే సాల్మన్‌ వంటి చేపలను మెనూలో ఉండేలా చూసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే సాల్మన్‌ చేపకు మూడ్‌ బూస్టింగ్‌ ఫుడ్‌గా పేరుంది.

బ్రొక్కొలి పోషకాల పాళ్లు ఎక్కువ. పిల్లల ఇమ్యూనిటీని పెంచడంతో పాటు చైతన్యంగా ఉండేలా చేస్తుంది. కోడిగుడ్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటితో పాటు నట్స్‌ తినేలా చూడాలి. 

Advertisement
Advertisement