ఆరోగ్యమే మహాభాగ్యం : జడ్పీ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2022-05-22T05:02:36+05:30 IST

ఆరోగ్యమే మహాభాగ్యమని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం : జడ్పీ చైర్‌పర్సన్‌

చిన్నకోడూరు, మే 21: ఆరోగ్యమే మహాభాగ్యమని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. శనివారం మండలంలోని చంద్లాపూర్‌ గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు. పేదలు కంటి సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో మంత్రి హరీశ్‌రావు ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ వారికి అండగా నిలుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పేదల పక్షాన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కంటి వైద్య పరీక్షలు చేసుకున్న వారిలో ఆపరేషన్లు అవసరమున్న 40 మందికి దశలవారీగా కంటి ఆపరేషన్లు చేస్తారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, డీఎంహెచ్‌వో కాశీనాథ్‌, ఆప్తామాల్మిక్‌ అధికారులు శ్రీనివాస్‌, తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ చంద్రకళ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:02:36+05:30 IST