Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాలాసనంతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే..

ఆంధ్రజ్యోతి(16-11-2021)

యోగాసనాలతో భిన్నమైన ప్రయోజనాలుంటాయి. ఆసనాలు సాధన చేయడంతో పాటు, వాటితో పొందే ప్రయోజనాలను తెలుసుకోగలిగితే, యోగా పట్ల ఆసక్తి రెట్టింపవుతుంది. మాలాసనంతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే...


ఏం జరుగుతుంది: ఈ ఆసనం వేసినప్పుడు తొడలు, కటి, పిరుదులు, కాలి గిలకలు, నడుము విప్పారతాయి. పొత్తికడుపు కండరాలు వ్యాకోచిస్తాయి.


ప్రయోజనం: పెద్దపేగు పనితీరు మెరుగై విసర్జన వ్యవస్థ మెరుగు పడుతుంది. విరోచనం సాఫీగా అవుతుంది. ఈ ఆసనంతో కటి ప్రదేశానికి రక్తప్రసరణ పెరిగి, లైంగిక శక్తి మెరుగవుతుంది.

Advertisement
Advertisement