Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 22 Jan 2022 00:09:22 IST

చిన్నారికి తలసేమియా

twitter-iconwatsapp-iconfb-icon
చిన్నారికి తలసేమియాఆపరేషన చేయించుకుని డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న చిన్నారి మస్తాన వలి

ఉన్న ఇల్లు అమ్ముకొని దాతల సహకారంతో బోనమ్యారో ఆపరేషన

రూ.44 లక్షలకు చేరుకున్న ఆపరేషన ఖర్చు

రూ.6లక్షలు కడితేనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

ఆపన్న హస్తం కోసం చిన్నారి తల్లిదండ్రుల ఎదురుచూపు


ఆ పేద కుటుంబంలో బిడ్డ పుట్టిన సంతోషం ఎన్నాళ్లో నిలువలేదు. పుట్టిన కొడుకు 11నెలలు తిరగకముందే అనారోగ్యానికి గురవడంతో వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. వారి వద్ద ఉన్న నగదు, బంగారం, అప్పుచేసి  మరీ సుమారు రూ.17లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. తలసేమియా వ్యాధిగా నిర్ధారించి ఆపరేషనకు రూ.30లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఉన్న ఇల్లు అమ్ముకొని దాతల సహకారంతో ఆపరేషన చేయించారు. అయితే ఆపరేషన ఖర్చు అంతకంతకు పెరిగి రూ.44లక్షలు అయింది. ఇప్పటికే రూ.38లక్షలు చెల్లించగా ఈ నెలాఖరులోగా రూ.6 లక్షలు చెల్లిస్తే డిశ్చార్జి అయిపోవచ్చు అని డాక్టర్లు చెప్పడంతో ఆ పేద తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆపన్నుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాలు ఇలా..


వేంపల్లె, జనవరి 21: వేంపల్లె గరుగు వీధికి చెందిన కూలిపనులతో జీవనం సాగించే షేక్‌ అలి అహ్మద్‌, మల్లిక దంపతులకు 3 సంవత్సరాల కొడుకు మస్తాన వలి ఉన్నాడు. 11 నెలల వయసు నుంచే అనారోగ్యానికి గురికావడం, తరచూ శరీరంలో రక్తం తగ్గిపోవడంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశలోని వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. తలసేమియా వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. తరచూ రక్తం మార్పిడి చేయకుంటే ఎక్కువ రోజులు బతకడని చెప్పడంతో సుమారు రూ.17 లక్షలకు పైగా ఖర్చు చేసి కొన్నాళ్లు బతికించు కున్నారు. ఆపరేషన చేస్తేనే సమస్య లేకుండా బతుకుతాడని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో ఆ కన్న తల్లిదండ్రులకు బిడ్డపై ఉన్న మమకారంతో ఉన్న ఇంటిని అమ్ముకున్నారు. ఈ విషయం తెలిసి 25 డిసెంబర్‌ 2020న ‘జగనన్నా.. ప్రాణభిక్ష పెట్టండి తలసేమియా - వ్యాధితో మృత్యువు ముంగిట చిన్నారి - ఆపరేషనకు రూ.30 లక్షలు అవసరం’ అంటూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. అప్పట్లో ఎంపీ, పలువురు దాతలు స్పందించారు. దీంతో పాటు భవిత కేంద్రంలో పనిచేసే ఐఈఆర్టీ యశోద సహకారంతో పలువురు దాతల నుంచి విరాళాలు సేకరించి కొంతమొత్తాన్ని సమకూర్చి ఎప్పటికప్పుడు ఆమె ధైర్యం చెప్పడంతో ఆపరేషన వరకు వెళ్లారు. రూ.30 లక్షలు అవుతుందనుకున్న ఖర్చు రూ.44 లక్షలకు చేరింది. జనవరి 11వ తేదీన బోనమ్యారో ట్రాన్సప్లాంటేషన ఆపరేషన నిర్వహించారు. ప్రస్తుతం చెల్లించిన డబ్బు పోగా ఇక రూ.6 లక్షలు చెల్లిస్తే ఈ నెలాఖరుకు డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి నిర్వాహకులు తల్లిదడ్రులకు చెప్పారు. చేతిలో చిల్లిగవ్వలేని ఆ దంపతులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇక డబ్బుల కోసం ఎక్కడికెళ్లాలంటూ మధనపడుతున్నారు. ఇంటికొచ్చిన తర్వాత రెండు నెలల పాటు మందుల కోసం మరో రూ.5లక్షలు అవసరం అవుతుంది. దీంతో ఆ దంపతులు బిడ్డకు ఆపరేషన జరిగిందన్న సంతోషం ఒకవైపు ఉండగా ఇంకా డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలీక కుమిలిపోతున్నారు. ఆపన్న హస్తం అందిస్తే ఆ పేద కుటుంబంలో సంతోషాన్ని నింపవచ్చు. దాతలు ముందుకు రావాలని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. సహాయం చేయదలచిన వారు ఫోనపే నెంబర్లు 9000175008, 7032324217 లేదా అకౌంట్‌ నెంబర్‌ 30942270950, ఐఎ్‌ఫసీ:ఎస్‌బీఐఎన 0003749కు పంపాలని వేడుకొంటున్నారు. 

చిన్నారికి తలసేమియాఆపరేషనకు ముందు బిడ్డతో తల్లిదండ్రులు షేక్‌ అలి అహ్మద్‌, మల్లిక


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.