ఘన స్వాగతం పలికిన శ్రేణులు

ABN , First Publish Date - 2022-05-20T07:53:26+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం అర్ధరాత్రి 1.48 గంటలకు జిల్లా సరిహద్దులోని కరడికొండ గ్రామం వద్దకు చేరుకున్నారు.

ఘన స్వాగతం పలికిన శ్రేణులు
కరిడికొండ వద్ద శ్రేణులు, అభిమానులకు చంద్రబాబు అభివాదం

అర్ధరాత్రి సరిహద్దుకు అధినేత

ఆరుగంటలకు పైగా నిరీక్షించిన శ్రేణులు

కరిడికొండ వద్ద చంద్రబాబుపై పూలవర్షం  

అనంతకు చేరేవరకూ అడుగడుగునా జనహోరు

అనంతపురం మే 19(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం అర్ధరాత్రి 1.48 గంటలకు జిల్లా సరిహద్దులోని కరడికొండ గ్రామం వద్దకు చేరుకున్నారు. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని అనంతపురం జిల్లా సరిహద్దుకు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ్ముళ్లు భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, పార్టీ ఉమ్మడి జిల్లాల ఇనచార్జి జీటీ నాయుడు, టీడీపీ కళ్యాణదుర్గం నియోజకర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, వెంకట శివుడు యాదవ్‌, బండారు శ్రావణి శ్రీ, మాజీ మేయర్‌ స్వరూప, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌, పార్టీ నాయకులు ఉన్నం మారుతీ చౌదరి, పెరుమాళ్ల జీవానందరెడ్డి తదితరలు చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అక్కడి నుంచి అనంతపురం నగరానికి బయలుదేరిన చంద్రబాబుపై గుత్తి, పామిడి, గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో కల్లూరులో గజమాలతో చంద్రబాబును సత్కరించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి జిల్లాలో పర్యటనకు వచ్చారు. అనంతపురం నగరంలోని వీవీఆర్‌ కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పార్టీ ఉమ్మడి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో బాదుడే బాదుడు సభ నిర్వహిస్తారు. 





Updated Date - 2022-05-20T07:53:26+05:30 IST