విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ళ తీపి కబురు

ABN , First Publish Date - 2020-04-04T15:45:35+05:30 IST

హర్యానాలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఉపశమనం కలిగించే వార్త వెలువడింది. లాక్డౌన్ కాలంలో ఫీజులను వసూలు చేయవద్దని...

విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ళ తీపి కబురు

చండీగఢ్: హర్యానాలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు  ఉపశమనం కలిగించే వార్త వెలువడింది. లాక్డౌన్ కాలంలో ఫీజులను వసూలు చేయవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలను కోరింది. వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది. ఈ సమయంలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ప్రధాని నరేంద్ర మోదీ  21 రోజుల లాక్‌డౌన్ విధించారు. ఇది ఏప్రిల్ 14 తో ముగుస్తుంది. హర్యానా ప్రభుత్వం విడుదల చేసిన  ఒక అధికారిక ప్రకటనలో ప్రైవేట్ పాఠశాలల్లో అన్ని  రకాల ఫీజుల  వసూళ్లను వెంటనే నిలిపివేయాలని కోరింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల  విద్యాశాఖాధికారులు, జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారులు  ఆయా ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలకు ఈ విషయాన్ని తెలియజేయాలని హర్యానా పాఠశాల విద్యా శాఖ కోరింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఫీజులు విషయమై  ప్రస్తావించాలని సూచించింది. 


Updated Date - 2020-04-04T15:45:35+05:30 IST