ఆగస్టు 9 వరకు లాక్‌డౌన్.. అయితే వాటికి మాత్రం..
ABN , First Publish Date - 2021-08-01T05:44:30+05:30 IST
హర్యానాలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు..
హర్యానాలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే కొన్ని సడలింపులు మాత్రం ఇచ్చింది. షాపులు, మాల్స్ ఓపెన్ చేసుకునేందుకు ఓకే చెప్పింది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు షాపులు తెరుచుకునేందుకు, 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాల్స్ తెరుచుకునేందుకు అనుమతిచ్చింది.
అదేవిధంగా యూనివర్సిటీలు తెరుచుకునేందుకు కూడా అనుమతివ్వాలని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ అన్నారు. రాబోయే అకడెమిక్ ఇయర్ నుంచి యూనివర్సిటీలు తెరుచుకునేందుకు అనుమతినివ్వాలని, అలాగే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది, ఇతర సిబ్బంది, విద్యార్థులు అంతా వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని సూచించారు.