ఉగాదిలోగా ప్రారంభానికి ఇళ్లను సిద్ధం చేయండి: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-02-20T07:14:05+05:30 IST

ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వచ్చే ఉగాది నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ఉగాదిలోగా ప్రారంభానికి ఇళ్లను సిద్ధం చేయండి: హరీశ్‌రావు

మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి19: ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వచ్చే ఉగాది నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పిల్లికోట్టాలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీ సుభా్‌షరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్లను  పూర్తి చేసి ఉగాది నాటికి ప్రారంభించేలా సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో తాగునీరు,  విద్యుత్‌ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఈ ఇళ్లను పంపిణీ చేసేందుకు గాను నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. ఇళ్ల నిర్మాణ ప్రాంతాల్లో మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలను నిర్మించేలా ఆదేశాలను అందజేయాలన్నారు.  పనులను వేగవంతం చేయడానికి కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ క్షేత్రస్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. మెదక్‌, నర్సాపూర్‌ పట్టణాల్లో నిర్మిస్తున్న ఇళ్లకు మంచినీటి సరఫరా కొరకు రేపటిలోగా నిధులను సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎ్‌ససీని ఫోన్‌ కోరారు.  గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టే వాటికి విద్యుత్‌ కనెక్షన్ల కోసం అవసరమైన నిధులను రూ.25 లక్షలు, ఎంపీ నిధులు రూ. 25లక్షలు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు, విద్యుత్‌ శాఖ ఎసీఈ శ్రీనాథ్‌, ఆర్‌డుబ్ల్యుఎ్‌సఈఈ కమలాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-02-20T07:14:05+05:30 IST