అంబేద్కర్, జగ్జివన్‌రామ్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు: హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-04-05T17:39:03+05:30 IST

అంబేద్కర్, జగ్జివన్‌రామ్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

అంబేద్కర్, జగ్జివన్‌రామ్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు: హరీష్‌రావు

హైదరాబాద్: జగ్జివన్‌రామ్ 1952 నుండి వరసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేశారని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం జగ్జివన్‌రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. గాంధీజీ ఎన్నో సందర్భాలలో జగ్జివన్ రామ్‌ను కొనియాడారన్నారు. ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా.. చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్, జగ్జివన్ రామ్ కలలను  సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పది లక్షల రూపాయల నగదు బదిలీ చేసే దళిత బంధు పథకం తెలంగాణలోనే ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంటే.. ఇప్పుడు సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో రిజర్వేషన్ తెచ్చారన్నారు. ఎస్సీ సంక్షేమ నిధి ఎక్కడ లాబ్స్ కాకుండా చట్ట భద్రత చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జగ్జివన్ రామ్ భవనాన్ని నిర్మించుకున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Updated Date - 2022-04-05T17:39:03+05:30 IST