ఘనంగా శ్రీకృష్ణాష్టమి

ABN , First Publish Date - 2022-08-20T06:00:04+05:30 IST

కామారెడ్డి జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ మందిరంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భగవద్గీత పారాయణం, క్షీరాభిషేకం, నైవేద్యం, మంగళ హారతులు నిర్వహించారు.

ఘనంగా శ్రీకృష్ణాష్టమి
కామారెడ్డిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిన్నారులు

కామారెడ్డి టౌన్‌/భిక్కనూరు/దోమకొండ/సదాశివనగర్‌/పెద్దకొడప్‌గల్‌/నస్రుల్లాబాద్‌/నాగిరెడ్డిపేట, ఆగస్టు 19: కామారెడ్డి జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ మందిరంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భగవద్గీత పారాయణం, క్షీరాభిషేకం, నైవేద్యం, మంగళ హారతులు నిర్వహించారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలోని శ్రీకృష్ణ మందిరంలో విశ్వక్‌సేన ఆరాధన, స్వామి వారికి 108 కలశాలతో అభిషేకం, సహస్ర నామార్చన, స్వామి వారికి క్షీరాభిషేకం, సుదర్శన నరసింహ హోమం, స్వామి వారికి 56 రకాల స్వీట్స్‌తో నివేదన, మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ, రాత్రి డోలారోహణం, ఉట్టికొటే కార్యక్రమాలు చేపట్టారు. దోమకొండలోని ముత్యంపేట, సంగమేశ్వర్‌, అంచనూర్‌, సీతారాంపల్లి, చింతమాన్‌పల్లి, లింగుపల్లి, దోమకొండ పాఠశాలలో విద్యార్థులతో శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో నృత్యాలు చేశారు. సదాశివనగర్‌లోని లింగంపల్లి శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి మచాలి బాబా నేతృత్వంలో డోలారోహణం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల భజన మండలి భక్తులు అర్ధరాత్రి వరకు భజన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దకొడప్‌గల్‌లోని శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పాటు ఆయా పాఠశాలల్లో వేడుకలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలు ఆకట్టుకున్నాయి.  నస్రుల్లాబాద్‌ మండలంలోని ఆయా గ్రామాల అంగన్‌వాడీ సెంటర్లు, పాఠశాలల్లో, తదితర చోట్ల శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. మిర్జాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో రంగవల్లిక, క్విజ్‌ పోటీలను నిర్వహించారు. అంగన్‌వాడి సెంటర్‌లో చిన్నారుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి. నాగిరెడ్డిపేటలో శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో చిన్నారులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల వేషధారణలు అందరిని అబ్బురపరిచాయి.

Updated Date - 2022-08-20T06:00:04+05:30 IST