మంత్రి సబితారెడ్డి
రంగారెడ్డి అర్బన్/వికారాబాద్, జనవరి 25: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు మంత్రి సబితారెడ్డి గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజల కు అందుతున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన అవకాశమన్నారు. మహానీయుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలని చె ప్పారు. మనకు రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌ను యావత్ జాతి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
- సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.25.03కోట్లు
రంగారెడ్డి జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.25కోట్ల 3లక్షలు మంజూరైనట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు విడు దల చేశారని, అవసరమున్న చోట్ల రోడ్లు వేస్తామన్నారు.