కొత్త సీఎస్‌గా హన్స్‌రాజ్‌వర్మ?

ABN , First Publish Date - 2021-01-14T16:31:17+05:30 IST

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి హన్స్‌రాజ్‌వర్మ నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది.

కొత్త సీఎస్‌గా హన్స్‌రాజ్‌వర్మ?

చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి హన్స్‌రాజ్‌వర్మ నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. 2019లో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన షణ్ముగం పదవీకాలం 2020 జూలైలో ముగియగా, కరోనా కారణంగా ఆయన పదవీకాలం మూడు నెలలు పొడిగించారు. అక్టోబరుతో ముగియగా, మరో మూడు నెలలు పొడిగించాలన్న రాష్ట్రప్రభుత్వ సిఫారసులను కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఈనెల 31వ తేదీతో ఆయన పదవీకాలం పూర్తి కానుంది.


అయితే తన పదవీకాలం మరింత పొడిగించవద్దని షణ్ముగం ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కొత్త సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా వున్న హన్స్‌రాజ్‌వర్మను నియ మించే యోచనలో ప్రభుత్వం వున్నట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే కసరత్తు చేసిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, హన్స్‌రాజ్‌ వర్మ పేరును ఖరారు చేశారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశముందని ఆ వర్గాలు వివరించాయి. 

Updated Date - 2021-01-14T16:31:17+05:30 IST