వేలాడే డైమండ్‌ కెఫే

ABN , First Publish Date - 2022-07-03T18:01:56+05:30 IST

చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు... మధ్యలో లోయ... రెండు పర్వతాలను కలుపుతూ గాజు వంతెన... గాల్లో వేలాడే ఆ వంతెన మీద నడవాలంటే

వేలాడే డైమండ్‌ కెఫే

చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు... మధ్యలో లోయ... రెండు పర్వతాలను కలుపుతూ గాజు వంతెన... గాల్లో వేలాడే ఆ వంతెన మీద నడవాలంటే కాసింత ధైర్యం, తెగువ కావాల్సిందే. ఎలాగోలా ఊపిరి బిగపట్టి వంతెన మీద నడుస్తూ వెళ్లి కోల్డ్‌ కాఫీ ఆర్డర్‌ చేస్తే... అసలే టెన్షన్‌లో ఉంటే ఈ కాఫీ గోల ఏంటానిపిస్తోందా? గాజు వంతెన మధ్యలో మూడు అంతస్తుల డైమండ్‌ కేఫే ఉంది మరి. ప్రపంచంలో వేలాడే అతి పెద్ద నిర్మాణంగా ఈ ‘డైమండ్‌ కెఫే’ గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లోకి ఎక్కబోతోందట. 787 అడుగుల పొడవున్న ఈ గాజు వంతెనను ఇటీవలే ప్రారంభించారు. ఈ వింత, విలక్షణమైన నిర్మాణం టూరిజంలో ముందుండాలని ఉవ్విళ్లూరే జార్జియాలో ఉంది. రాజధాని తుబిలిసీ నుంచి రెండు గంటలు ప్రయాణం చేస్తే దాష్‌బాషీ లోయల్లో ఈ అద్భుతం కనువిందు చేస్తుంది.

Updated Date - 2022-07-03T18:01:56+05:30 IST