అర్ధ శతాబ్దం.. అప్రతిహతం!

ABN , First Publish Date - 2020-09-17T08:30:29+05:30 IST

అసెంబ్లీలో ఏకంగా 50 ఏళ్లపాటు పాతుకుపోవడం, వరుసగా 11 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆషామాషీ విషయమేం కాదు...

అర్ధ శతాబ్దం.. అప్రతిహతం!

  • 50 ఏళ్లుగా ఓటమెరుగని ఎమ్మెల్యే ఊమెన్‌ చాందీ


తిరువనంతపురం, సెప్టెంబరు 16 : అసెంబ్లీలో ఏకంగా 50 ఏళ్లపాటు పాతుకుపోవడం, వరుసగా 11 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆషామాషీ విషయమేం కాదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. సెప్టెంబరు 17న సరికొత్త రికార్డును లిఖించబోతున్నారు కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ. గత ఐదు దశాబ్దాల కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కానీ.. ఓడిపోవడం కానీ తెలియని ఏకైక నేతగా నిలవబోతున్నారు. గురువారం నాటికి ఎమ్మెల్యేగా ఆయన 50 ఏళ్ల ప్రస్థానం పూర్తవుతుంది. 1970 సంవత్సరంలో 27 ఏళ్ల వయసులో నాటి కమ్యూనిస్టు కంచుకోట పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి, తొలిసారిగా కేరళ అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 1977లో కె.కరుణాకరన్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చాందీని మొదటిసారి మంత్రి పదవి వరించింది. ఇలా మొదలైన రాజకీయ ప్రయాణంలో 27 ఏళ్లు గడిచాక.. 2004లో చాందీ కేరళ ముఖ్యమంత్రి అయ్యారు.  

Updated Date - 2020-09-17T08:30:29+05:30 IST