కురులు పరిమళించేందుకు!

ABN , First Publish Date - 2021-02-17T18:01:58+05:30 IST

స్నేహితులతో కలిసి షాపింగ్‌, పార్టీలకు వెళ్లాలనుకుంటారు. తీరా రెడీ అయిన తరువాత జుట్టు తడిగా, ఆయిలీగా ఉండడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు డ్రై షాంపూ వాడితే ఎంచక్కా పార్టీని ఎంజాయ్‌ చేయవచ్చు. సమయం తక్కువ ఉన్నప్పుడు డ్రై షాంపూతో కురులను తాజాగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

కురులు పరిమళించేందుకు!

ఆంధ్రజ్యోతి(17-02-2021)

స్నేహితులతో కలిసి షాపింగ్‌, పార్టీలకు వెళ్లాలనుకుంటారు. తీరా రెడీ అయిన తరువాత జుట్టు తడిగా, ఆయిలీగా ఉండడం  ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు డ్రై షాంపూ వాడితే ఎంచక్కా పార్టీని ఎంజాయ్‌ చేయవచ్చు. సమయం తక్కువ ఉన్నప్పుడు డ్రై షాంపూతో కురులను తాజాగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

డ్రై షాంపూను కురుల కుదుళ్ల మీద స్ర్పే చేసి, నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. కొద్దిసేపయ్యాక బ్రష్‌తో వెంట్రుకల మీదున్న డ్రై షాంపూ పొడిని తొలగించాలి. జుట్టు మురికిగా, జిడ్డుగా, చెమటగా అనిపించినప్పుడు డ్రై షాంపూ వాడాలి. 

వెంట్రుకలు మురికిగా ఉండి వాసన వస్తుంటే డ్రై షాంపూ స్ర్పే చేయాలి. ఇలా చేస్తే కురులు పరిమళిస్తాయి.

కుదుళ్ల దగ్గర డ్రై షాంపూ స్ర్పే చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా కనిపిస్తాయి. 

Updated Date - 2021-02-17T18:01:58+05:30 IST