Gyanvapi Masjid Survey latest: రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలన్న కోర్టు

ABN , First Publish Date - 2022-05-17T22:36:33+05:30 IST

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ఓ బావిలో శివలింగం బయటపడిన ఘటనపై వీడియోగ్రఫీ సర్వే నివేదికను

Gyanvapi Masjid Survey latest: రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలన్న కోర్టు

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ఓ బావిలో శివలింగం బయటపడిన ఘటనపై  వీడియోగ్రఫీ సర్వే నివేదికను ఈ నెల 19లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అదే సమయంలో కోర్ట్ కమిషనర్‌ అజయ్ కుమార్ మిశ్రాను తొలగించింది. అజయ్ కుమార్ మిశ్రా పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగించింది. మరోవైపు నివేదిక సమర్పించేందుకు రెండు రోజుల సమయం కావాలని అసిస్టెంట్ కోర్ట్ కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కోర్టు 2 రోజుల గడువిచ్చింది.   






 



Updated Date - 2022-05-17T22:36:33+05:30 IST