ఘనంగా తీర్థ మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-01-16T05:40:24+05:30 IST

ఉక్కు నిర్వాసిత కాలనీల్లో సంక్రాంతి, కనుమ పర్వ దినాలను పురస్కరించుకొని పలు గ్రామాల్లో తీర్థమహోత్సవాలు నిర్వాహకులు అత్యంత వైభవంగా నిర్వహించారు

ఘనంగా తీర్థ మహోత్సవాలు
తీర్థ మహోత్సవాల్లో మహిళల కోలాటాలు

అగనంపూడి: అగనంపూడి, ఉక్కు నిర్వాసిత కాలనీల్లో సంక్రాంతి, కనుమ పర్వ దినాలను పురస్కరించుకొని పలు గ్రామాల్లో తీర్థమహోత్సవాలు నిర్వాహకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. దానబోయినపాలెంలో సీతారాములు ఆలయ ప్రాంగణంలో స్వామి వారి పరసను ఘనంగా నిర్వహించారు.  కోలాటాలు, చెక్కభజనలు, డప్పు వాయిద్యాలు, చిడతలు, ఏర్పాటు చేశారు. అలాగే పల్లె వాతావరణం తలపించే విధంగా సెట్‌ను ఏర్పాటు చేశారు.  దిబ్బపాలెం గ్రామంలో సీతారాముల పరస మహోత్సం, అగనంపూడిలో జగన్నాఽథ స్వామి తీర్థాన్ని ఘనంగా నిర్వహించారు. 

నేడు పెదమడకలో శ్రీసీతారాముల పరస 

అగనంపూడి: పెదమడక రామాలయం వద్ద సీతారామ పరస మహోత్సవాన్ని శనివారం నిర్వహిస్తున్నట్టు  ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆలయం వద్ద భజనలు, కోలాటాలు, గరిడీలు, చిడతలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 


Updated Date - 2021-01-16T05:40:24+05:30 IST