వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-06-20T05:20:48+05:30 IST

నగరంలోని అన్ని వార్డుల్లో ఆదివారం నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన పిలుపునిచ్చారు.

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోండి
జీవీఎంసీ 41వ వార్డులో పర్యటిస్తున్న కమిషనర్‌ సృజన

విశాఖ నగరవాసులకు కమిషనర్‌ సృజన పిలుపు

విశాఖపట్నం, జూన్‌ 19: నగరంలోని అన్ని వార్డుల్లో ఆదివారం నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక  డ్రైవ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన పిలుపునిచ్చారు. శనివారం ఆమె 41వ వార్డు పరిధిలోని రైల్వేన్యూకాలనీ, సుబ్బలక్ష్మీనగర్‌ తదితర ప్రాంతాల్లో జెడ్సీ పి.సింహా చలం, ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. వార్డులో పారిశుధ్య నిర్వహణ పరిస్థితులను తెలుసుకున్నారు. తడి, పొడి చెత్త సేకరణ, తరలింపు తదితర అంశాలను తెలుసుకున్నారు. పారిశుధ్య కార్మికులకు యూనిఫాం, మాస్క్‌లు, గ్లౌజ్‌లు సక్రమంగా అందుతున్నదీ, లేనిదీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై ఐదేళ్ల వయసుండి, ఐదేళ్లలోపు పిల్లలున్న మహిళలందరికీ వ్యాక్సినేషన్‌ ఈ ప్రత్యేకడ్రైవ్‌ ఉద్దేశమని చెప్పారు. అందువల్ల అర్హులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆమె వెంట వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, జీవీఎంసీ అధికారులు ఉన్నారు.

Updated Date - 2021-06-20T05:20:48+05:30 IST