గువహటి (అసోం): గౌహతిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 7వ అంతస్తు నుంచి కింద పడి ఓ వైద్యుడు మృతి చెందారు.అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ భవనం పై నుంచి డాక్టర్ కిందపడ్డారు. నిర్మాణపనులు చేస్తున్న కార్మికులు పెద్ద శబ్ధం విని సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ డాక్టర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని పోలీసులు చెప్పారు.ఫాల్గు ప్రతిమ్ దాస్ అనే వైద్యుడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించినట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ భవనం పై నుంచి కింద పడిన ఘటన ప్రమాదమా? ఆత్మహత్య అనేది విచారణలో తెలుస్తుందని పోలీసులు చెప్పారు.ఎయిమ్స్ అధికారికంగా తెరవనప్పటికీ గువహటి నుంచి 25.5 కిలోమీటర్ల దూరంలోని చాంగ్ సారి వద్ద తరగతులు ప్రారంభమయ్యాయి.
ఇవి కూడా చదవండి