Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ సమస్య ఉన్నవారు జామపండు జ్యూస్ తాగితే..?

ఆంధ్రజ్యోతి(12-01-2021)

హార్మోన్ల అసమతుల్యతతో బాధపడే వారు ప్రతిరోజూ ఒక జామపండు తింటే ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు, జామ రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. జామ పండుతో చేసిన జ్యూస్‌ తాగితే మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. 


వెల్లుల్లి చేసే మేలు తెలిసిందే. వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు రోజూ వెల్లుల్లిని తీసుకుంటే కొద్దిరోజుల్లోనే బీపీ నియంత్రణలోకి వస్తుంది. 


ఉదయం నిద్రలేవగానే కొందరిని వరుసగా తుమ్ములు వేధిస్తుంటాయి. అలాంటి వారు రెండు మూడు స్పూన్ల తులసి ఆకుల రసం తాగితే ఫలితం ఉంటుంది. 


రాత్రి పడుకునే సమయంలో దగ్గు వేధిస్తుంటే గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా తేనె వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. 


సీతాఫలం విత్తనాలను పడేయకుండా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేసి జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. 


రోజూ బ్రష్‌ చేసుకునే సమయంలో పేస్టుతోపాటు రెండు చుక్కల నిమ్మరసంను బ్రష్‌పై వేసుకుని పళ్లు తోముకుంటే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి.

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...