రూ.4.71లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-06-18T05:15:48+05:30 IST

అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.71 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్‌, ఖమ్మం రూరల్‌ పోలీసులు సీజ్‌ చేసిన సంఘటన మండల పరిదిలోని నాయుడుపేట వద్ద గురువారం చోటుచేసుకుంది.

రూ.4.71లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఖమ్మం రూరల్‌, జూన్‌ 17: అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.71 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్‌, ఖమ్మం రూరల్‌ పోలీసులు సీజ్‌ చేసిన సంఘటన మండల పరిదిలోని నాయుడుపేట వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సారపాకకు చెందిన కొత్తె అనిల్‌ కుమార్‌, చంద్రుగొండకు చెందిన కారు డ్రైవర్‌ తిరుపతిరావు కలిసి బీదర్‌ నుంచి నిషేదిత గుట్కాప్యాకెట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని నాయుడుపేటలో వాహనాల తనిఖీ చేపట్టగా అనుమానాస్పదంగా కన్పించిన కారును తనిఖీ చేయగా అందులో 9 బస్తాల నిషేదిత గుట్కా పొట్లాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.4,17,500లు ఉంటుందన్నారు. గుట్కాపొట్లాలను స్వాదీనం చేసుకొని కారును సీజ్‌ చేశారు. కారు డ్రైవర్‌ తిరుపతిరావు పరారయ్యాడు. గుట్కా వ్యాపారి అనిల్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని రూరల్‌ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


రూ.29 లక్షల పొగాకు ఉత్పత్తులు స్వాధీనం


 అక్రమంగా రవాణా చేసి నిల్వ ఉంచిన సుమారు రూ.29 లక్షల విలువ గల పొగాకు ఉత్పత్తులను పోలీసులు సీజ్‌ చేసిన సంఘటన ఖమ్మం రూరల్‌ మండలం, పెద్దతండాలోని గిస్కానాయక్‌ నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్నాటక రాష్ట్రం నుంచి పొగాకు ఉత్పత్తులు తీసుకువచ్చి అక్రమంగా నిల్వచేశారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం రూరల్‌ సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గిస్కానాయక్‌నగర్‌లో తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో రూ.35వేల విలువగల గుట్కా పొట్లాలతో పాటుగా రూ.29 లక్షల విలువగల 119 బాక్స్‌ల పొగాకు ఉత్పత్తులను సీజ్‌ చేశారు. పొగాకు ఉత్పత్తులు జలగంనగర్‌కు చెందిన భరత్‌కు చెందినవిగా గుర్తించారు. పొగాకు ఉత్పత్తుల జీఎ్‌సటీ, వాస్తవ వివరాలు తెలుసుకునేందుకు కమర్షియల్‌ టాక్స్‌ అధికారులకు పోలీసులు అప్పగించారు. పొగాకు ఉత్పత్తులను నిల్వచేసిన భరత్‌పై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదేవిదంగా మండలపరిదిలోని తల్లంపాడు గ్రామానికి చెందిన పుచ్చకాయల సురేశ్‌ వద్ద రూ.15 వేల విలువ గల పొగాకు ఉత్పత్తులు ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-06-18T05:15:48+05:30 IST