పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు

ABN , First Publish Date - 2021-05-09T04:18:30+05:30 IST

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడుల్లో రూ.18,400 విలువ గల ప్రభుత్వ నిషేధిత అంబర్‌ జర్దా, గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి.

పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు

కోస్గి, మే 8: టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడుల్లో రూ.18,400 విలువ గల ప్రభుత్వ నిషేధిత అంబర్‌ జర్దా, గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. కోస్గి ఎస్సై నరేందర్‌ తెలిపిన వివరాల మేరకు...కోస్గి పట్టణంలోని రవి కిరాణంకు చెందిన వ్యక్తి ఇంట్లో ప్రభుత్వం నిషేధించిన అంబర్‌ జర్దా, గుట్కాప్యాకెట్లు నిల్వ ఉంచాడని పక్కా సమాచారంతో శనివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 18,400 విలువ గల గుట్కాప్యాకెట్టు స్వాధీనం చేసుకొని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2021-05-09T04:18:30+05:30 IST