భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

ABN , First Publish Date - 2021-07-25T04:23:26+05:30 IST

గురుపౌర్ణమి సందర్భంగా స్థానిక శనివారం సాయిబాబా మందిరంలో భక్తులు సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
గూడూరు: సాయిబాబాకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు

గూడూరురూరల్‌, జూలై 24: గురుపౌర్ణమి సందర్భంగా స్థానిక శనివారం సాయిబాబా మందిరంలో భక్తులు సాయిబాబాకు ప్రత్యేక పూజలు  చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామిని దర్శించుకున్నారు. భజనలు చేసి భక్తిపాటలు ఆలపించారు. సాయిసత్సంగా నిలయంలో కోట సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిపారు. స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో ఏజీఎం శ్రీకాంత్‌, ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గురుపౌర్ణమి పూజలు జరిపారు. 

చిల్లకూరులో...... 

 మండలంలోని అంకులపాటూరు, బల్లవోలు గ్రామాల్లోని సాయిబాబా ఆలయాల్లో  సాయిబాబాస్వామిని ప్రత్యేక అలంకారంలో ఉంచి పూజలు  చేశారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామిని దర్శించుకున్నారు.

ఓజిలి, : మండలంలోని మానమాలలో శనివారం ఘనంగా గురుపౌర్ణమి ముగింపు వేడుకలు జరిగాయి. గ్రామంలో సాయిబాబాను ఊరేగించారు. అంతకుముందు ఆలయ ధర్మకర్తలు ఉచ్చూరు హరినాథ్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఉచ్చూరు శోభారాణి సాయి మందిరంలో పండితుడు హరికృష్ణశర్మ వేదపఠనం మధ్య ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సొసైటీ మాజీ అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ మల్లికార్జున్‌రెడ్డిలు పాల్గొన్నారు.  సాయినాఽథుడిని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. ఆలయ సమీపంలో రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించి సాయంత్రం బాణసంచా, వినోద కార్యక్రమాలతో సాయినాథుడిని ఊరేగించారు. రాత్రి పల్లకి సేవ, శేజ్‌హారతితో గురుపౌర్ణమి వేడుకలను ముగించారు.

రాపూరు : మండలంలోని పలు గ్రామాల్లో గురుపౌర్ణమిని పురస్కరించుకుని  గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి గ్రామాల్లో యువకులు, గ్రామస్థులు గురుపూజోత్సవాలను ఆడంబరంగా నిర్వహించడం విశేషం. 

సూళ్లూరుపేట: సూళ్లూరుపేట శ్రీహరికోట రోడ్డులోని శ్రీసాయిసన్నిధి సత్సంగ్‌మందిరంలో శనివారం గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం సాయినాఽథుడికి పత్యేక అభిషేకం, అష్టోత్తర స్వర్ణకమల అర్చన నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయస్వామికి 58 లీటర్ల పాలతో అభిషేకం జరిపారు. ధునిపూజ, మధ్యాహ్నం అన్నదానం జరిగింది. సాయంత్రం పల్లకీసేవ నిర్వహించారు. కందికట్టు ప్రసాద్‌రావు, విజయకుమారి, ఆర్‌ఎంవి భాస్కర్‌బాబు-రాధ ఉభయ కర్తలుగా వ్యవహరించారు.

నాయుడుపేట : పట్టణంలోని అగ్రహారపేట. బ్రాహ్మణవీధిలో ఉన్న శ్రీ షిరిడీసాయిబాబా ఆలయాల్లో శనివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  తెల్లవారుజామున బాబాకు పాలాభిషేకం నిర్వహించారు. మహిళలు భౌతికదూరం పాటిస్తూ అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం సాయిబాబా ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం  చేశారు. కొవిడ్‌ కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు గురుపౌర్ణమి వేడుకలను ఒక్కరోజే ముగించారు. కార్యక్రమాల్లో పూనాటి తిరుమలనాయుడు, దాసరి ప్రభాకర్‌నాయుడు, పసుపులేటి రాజాబాబు, శ్రీధర్‌కుమార్‌, సాయిరామ్‌ పాల్గొన్నారు.

కోట : మండలంలోని విద్యానగర్‌, కోట, శ్యామసుందరపురం, తిమ్మానాయుడుపాళెం గ్రామాల్లో రెండో రోజు అయిన శనివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. షిరిడీ సాయిబాబాకు పాలు, చందనంతో అభిషేకాలు చేశారు.



Updated Date - 2021-07-25T04:23:26+05:30 IST