గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-06T05:34:34+05:30 IST

మైనార్టీ గురుకుల పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న మంత్రి

 మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట రూరల్‌, డిసెంబరు 5: మైనార్టీ గురుకుల పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్‌లకు సంబంధించిన కరపత్రాలను శనివారం సిద్దిపేటలోని ఆయన నివాసంలో ఆవిష్కరించి మాట్లాడారు. గురుకుల విద్యా వ్యవస్థ విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నదన్నారు. పదో తరగతి పూర్తి చేసుకున్న ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, పార్శి విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 40 సీట్లు ఉంటాయని వివరించారు. పూర్తి వివరాల కోసం 7331170818 నంబరులో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాజిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T05:34:34+05:30 IST