గుంటూరులో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-12-20T13:44:52+05:30 IST
జిల్లాలోని యడ్లపాడు దగ్గర సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో 9 మందికి గాయాలయ్యాయి.
గుంటూరు: జిల్లాలోని యడ్లపాడు దగ్గర సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో 9 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరంతా చిలకలూరిపేట నుంచి తుమ్మలపాలెం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.