గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను అక్కున చేర్చుకోవాల్సిన కుటుంబసభ్యులే వారిని గుడి ఎదుట విడిచి వెళ్లారు. బద్దురి వెంకట సుబ్బారెడ్డి (74) సీతారావమ్మ (70) చిలకలూరిపేటకు చెందిన దంపతులు. విషయం తెలిసిన స్థానికులు మానవత్వంతో వృద్ధ దంపతులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. ఇటీవల చిలకలూరిపేటలో ఉన్న తమ ఇంటిని 30 లక్షలకు కొడుకు పెరిరెడ్డి అమ్మేశాడని వృద్ధ దంపతులు తెలిపారు. ఇళ్లు అమ్మకం తర్వాత కొడుకు... తల్లిదండ్రులన్న కనికరం లేకుండా రోడ్డున వదిలేశాడు.
ఇవి కూడా చదవండి