గుంటూరు: కర్లపాలెం ఎంపీపీ పదవిపై వివాదం నెలకొంది. ఎంపీపీ అభ్యర్థిగా దొంతిబోయిన ఝాన్సీ లక్ష్మి ఎంపికయ్యారు. ఫలితాలు ప్రకటించేలోపే ఝాన్సీ లక్ష్మి మృతి చెందారు. దీంతో తాత్కాలిక ఎంపీపీగా యారం వనజకి బాధ్యతలు స్వీకరించారు. ఉపఎన్నికల వరకు ఎంపీపీగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలో రెండు నెలలోపే కర్లపాలెం ఎంపీపీ పదవికి ఉప ఎన్నికలు జరుగగా... చనిపోయిన ఝాన్సీలక్ష్మి కోడలు సామ్రాజ్యం గెలుపొందారు. దీంతో ప్రస్తుతం ఎంపీపీగా ఉన్న వనజను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోనరఘుపతి కోరారు. దీంతో ఆరు నెలలైనా ఎంపీపీ పదవిలో కొనసాగకపోవడంతో వనజ ఆవేదన వ్యక్తం చేశారు.