FILE PHOTO
Guntur: తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉండవల్లి (Undavalli) కరకట్ట ప్రక్కన పంట అయిపోయిన అరటి తోటకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. కరకట్టకు ఇరువైపుల మంటలు వ్యాపించాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ప్రక్కనే ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.