గుంటూరు జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పల్నాడు ప్రాంతంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరింది. లోలెవల్ చప్టాలపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల జగనన్న కాలనీలు నీట మునిగాయి.