తెనాలిలో అర్ధరాత్రి దారి దోపిడి, చోరీ ఘటనలు

ABN , First Publish Date - 2022-03-21T16:16:40+05:30 IST

జిల్లాలోని తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఒకే రోజు దారి దోపిడీ, చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి.

తెనాలిలో అర్ధరాత్రి దారి దోపిడి, చోరీ ఘటనలు

గుంటూరు: జిల్లాలోని తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఒకే రోజు దారి దోపిడీ, చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. చెంచుపేట జెండా చెట్టు బజార్లో నడిచి వెళ్తున్న కొమ్మూరు శ్రీనును దుండగులు అడ్డగించి దారి దోపిడీకి యత్నించారు. పెద్దగా కేకలు వేయడంతో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు దుండగులు బైక్‌ని వదిలేసి పరారయ్యారు. అటు సీఎం కాలనీ కొబ్బరితోటల వద్ద తాళం వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగలగొట్టు దొంగలు చోరీకి తెగబడ్డారు. ఇంట్లో ఉన్న రూ.20 వేల విలువ గల టీవీ చోరీకి గురైంది. ఈ ఘటనలపై బాధితులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-21T16:16:40+05:30 IST