Abn logo
May 13 2021 @ 13:23PM

మద్యం దుకాణాలలో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై వేటు

గుంటూరు: ప్రభుత్వ మద్యం దుకాణాలలో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. నిజాంపట్నం మండలం కూచినపూడి మద్యం దుకాణంలో రూ.19.75 లక్షలు, నిజాంపట్నం మద్యం దుకాణంలో రూ.15 లక్షల మేర సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం నగదును రికవరీ చేసినట్లు  ఆబ్కారీ ఉన్నతాధికారులు తెలిపారు. మద్యం దుకాణంలో సూపర్వైజర్లు, సేల్స్ మెన్లుగా పనిచేస్తున్న  నలుగురిని విధుల నుండి తొలగించినట్లు  ఆబ్కారీ సీఐ శ్రీనివాస మూర్తి తెలిపారు.

Advertisement