ZOO : మృగాల మధ్య మారణాయుధాలతో తాలిబన్లు

ABN , First Publish Date - 2021-09-19T02:04:05+05:30 IST

గత శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు పూర్తికాగానే ఉన్నట్టుండీ కాబూల్ జూలో తాలిబన్లు ప్రత్యక్షం అయ్యారు. అలవాటు ప్రకారం చేతిలో భారీ గన్నులు పట్టుకుని పిల్లలు, ఆడవారు, జంతువుల మధ్యకి వచ్చేశారు. కొంతమంది తాలిబన్ ఫైటర్స్ చేతుల్లో ఆయుధాలు లేకుండా కూడా తరలి వచ్చారు.

ZOO : మృగాల మధ్య మారణాయుధాలతో తాలిబన్లు

కాబూల్ : అది కాబూల్ నగరంలోని ప్రధాన జంతు ప్రదర్శనశాల. సాధారణంగా ఆ జూలో ఎక్కువగా చిన్న పిల్లలు, ఆడవారు కనిపిస్తుంటారు. కానీ, గత శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు పూర్తికాగానే ఉన్నట్టుండీ అక్కడ తాలిబన్లు ప్రత్యక్షం అయ్యారు. అలవాటు ప్రకారం చేతిలో భారీ గన్నులు పట్టుకుని పిల్లలు, ఆడవారు, జంతువుల మధ్యకి వచ్చేశారు. కొంతమంది తాలిబన్ ఫైటర్స్ చేతుల్లో ఆయుధాలు లేకుండా కూడా తరలి వచ్చారు. వారందరూ ఎప్పుడూ ఆఫ్ఘానిస్థాన్‌ పల్లెల్లో ఉండేవారు. అక్కడే పోరాటాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. అయితే, తాజాగా దేశం వారి వశం అయ్యాక చాలా మంది తాలిబన్ ఉగ్రవాదులు దేశ రాజధానికి దర్జాగా వస్తున్నారు. కాబూల్‌కి రావటమే వారికి మొదటిసారి కాబట్టి, ఇక జూకి వచ్చి క్రూర మృగాల్ని చూడటం, కొత్తేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా...


కాబూల్ జూలోకి ఎంట్రీ ఇచ్చిన సాయుధ తాలిబన్లు పిల్లలు, మహిళల నడుమ మెషిన్ గన్స్ పట్టుకుని హల్ చల్ చేశారు. సెల్ఫీలు కూడా దిగారు. కొందరైతే తమ మారణాయుధాల్ని పిల్లల చేతికి ఇచ్చి వారితో ఫోటోలకు ఫోజులిచ్చారు! ఒకరిద్దరు జిహాదీలైతే జింకల కొమ్ములు పట్టుకుని సరదాగా ఆటలాడారు కూడా! 


Updated Date - 2021-09-19T02:04:05+05:30 IST