లాక్ డౌన్ తో రాజస్థాన్ కు నడుచుకుపోతున్న గుజరాత్ కూలీలు

ABN , First Publish Date - 2020-03-26T16:01:31+05:30 IST

కరోనావైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించాక గుజరాత్ లో పనిచేస్తున్న రాజస్థాన్ కార్మికుల జీవనోపాధికి గండి పడింది. బస్సులు లేకపోవడంతో...

లాక్ డౌన్ తో రాజస్థాన్ కు నడుచుకుపోతున్న గుజరాత్ కూలీలు

అహ్మదాబాద్: కరోనావైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించాక గుజరాత్ లో పనిచేస్తున్న రాజస్థాన్ కార్మికుల జీవనోపాధికి గండి పడింది. బస్సులు లేకపోవడంతో గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు కాలినడకన రాజస్థాన్ లోని తమ ఇళ్లకు వెళుతున్నారు. అహ్మదాబాద్‌లో ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది భార్య, పిల్లలతో సైకిల్‌పై కూడా వెళ్లిపోతున్నారు. పనులన్నీ నిలిపివేసినట్లు గుజరాత్‌లోని భవన నిర్మాణ కార్మికులు తెలిపారు. ఇప్పుడు ఇంటికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదంటున్నారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌కు చెందిన గోవింద్ మాట్లాడుతూ “నేను నా సోదరుడితో కలిసి అహ్మదాబాద్‌లోని నిర్మాణ స్థలంలో పని చేస్తున్నాను. మా కుటుంబం కలిసి ఉంటోంది. పని లేకపోతే, డబ్బు ఇచ్చేది లేదని కాంట్రాక్టర్ చెప్పాడు" అని తెలిపాడు. అదేవిధంగా మారివాడ గ్రామానికి చెందిన హితేష్ నాథ్ మాట్లాడుతూ " మేము ప్రతి నెలా 9-10 వేల రూపాయలు సంపాదిస్తాం. ఇక్కడే ఉంటే డబ్బంతా ఖర్చు అవుతుంది" అని చెప్పాడు.  ఇలా గ్రామానికి తరలిపోతున్నవారికి పోలీసులు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. 

Updated Date - 2020-03-26T16:01:31+05:30 IST