నిసర్గ ఎఫెక్ట్.. 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన గుజరాత్

ABN , First Publish Date - 2020-06-03T01:29:07+05:30 IST

నిసర్గ ఎఫెక్ట్.. 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన గుజరాత్

నిసర్గ ఎఫెక్ట్.. 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన గుజరాత్

గాంధీనగర్: అరేబియా సముద్రంలో 'నిసర్గ' తీవ్ర తుపానుగా మారి, జూన్ 3న దక్షిణ గుజరాత్ తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్ రాష్ట్ర సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న 47 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నిసర్గ తుపాను ప్రభావంతో 47 గ్రామాల నుంచి దాదాపు 20 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికార యంత్రాంగం పేర్కొంది.

Updated Date - 2020-06-03T01:29:07+05:30 IST