జిల్లాలో పుష్కలంగా భూగర్భ జలాలు

ABN , First Publish Date - 2022-05-21T04:08:54+05:30 IST

జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని భూగర్భజల శాఖ జియాలజిస్టు దినకర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న ఫ్యూజో మీటర్‌ను ప్రెస్సింగ్‌ చేయించారు.

జిల్లాలో పుష్కలంగా భూగర్భ జలాలు
ఉదయగిరిలో ప్రెస్సింగ్‌ చేస్తున్న ఫ్యూజో మీటర్‌

ఉదయగిరి రూరల్‌, మే 20: జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని భూగర్భజల శాఖ జియాలజిస్టు దినకర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న ఫ్యూజో మీటర్‌ను ప్రెస్సింగ్‌ చేయించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలను గుర్తించేందుకు 110 ఫ్యూజో మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఏర్పాటు చేసిన వాటర్‌ లెవల్‌, క్వాలిటీ మీటర్లు సక్రమంగా పని చేయకపోవడంతో మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. అన్ని మండలాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఉదయగిరి ప్రాంతంలో గతేడాది 5 మీటర్లలో భూగర్భ జలం ఉండగా ప్రస్తుతం 3.8 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉందన్నారు. బోర్లను అధికలోతులో వేయకుండా భూగర్భ జలాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T04:08:54+05:30 IST