వరుడు.. వధువు ముందు వంగి ఆమె పాదాలను తాకుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తున్న ఈ చిన్న క్లిప్ భారతీయ సంప్రదాయాలకు భిన్నంగా ఉంది. ఇక్కడ వివాహం జరిగిన తర్వాత వధువు భర్త పాదాలను తాకుతుంది.
అయితే వరుడు.. వధువు పాదాలను తాకిన తర్వాత ఆమెను సంతోషంగా కౌగిలించుకున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. దీనిని చూసిన ఇన్స్టాగ్రామ్ యూజర్ దితి గోరాడియా "నువ్వు చాలా అదృష్టవంతురాలివి" అని కామెంట్ చేశారు. ఈ వీడియోకు 4.15 వేలకు పైగా లైక్లు వచ్చాయి. ఒక యూజర్ “నేను ఈరోజు ఇంటర్నెట్లో చూసిన అత్యంత ఆరాధనీయమైన విషయం’’ అని రాశారు. మరొక యూజర్ ‘‘దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.. అమ్మా నువ్వు రత్నాన్ని కనుగొన్నావు” అని రాశాడు.