Viral Video: భార్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోబోయిన వరుడు.. ఆ నవ వధువు షాకింగ్ రియాక్షన్..

ABN , First Publish Date - 2021-09-14T21:43:32+05:30 IST

హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత వధువు.. వరుడి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఎప్పట్నుంచో ఉన్న ఆచారం.

Viral Video: భార్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోబోయిన వరుడు.. ఆ నవ వధువు షాకింగ్ రియాక్షన్..

హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత వధువు.. వరుడి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఎప్పట్నుంచో ఉన్న ఆచారం. ప్రస్తుతం ఈ ఆచారాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆడా, మగా ఇద్దరూ సమానమే అన్న భావనే దీనికి కారణం. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 




ఆ వీడియోలో వివాహం తర్వాత వధువు.. వరుడి కాళ్లకు నమస్కరించింది. అనంతరం వరుడు కూడా వధువు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోబోయాడు. ఈ హఠాత్పరిణామానికి షాకైన వధువు వెనక్కి జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో మంది నెటిజన్లు వరుడి ప్రవర్తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే వధువు రియాక్షన్‌పై కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-14T21:43:32+05:30 IST