దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-03-07T06:58:20+05:30 IST

ల్లాలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

కోడ్‌ ఉన్నా అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

ఒంగోలు నగరం, మార్చి 6 : జిల్లాలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అన్నిశాఖల్లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల వివరాలను విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ అధికారులు నెలరోజుల క్రితమే సేకరించారు. అయితే వాటి భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. దీంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. జిల్లాలో  జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌, జూనియర్‌ స్టెనో, ల్యాబ్‌ టెక్నిషియన్‌, ఎలక్ట్రిషియన్‌, ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌), పబ్లిక్‌ హెల్త్‌ మేస్త్రి, పబ్లిక్‌హెల్త్‌ వర్కర్‌, కుక్‌, చౌకిదార్‌ వంటివి కలిపి 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల పూర్తి వివరాలను ప్రకాశం వెబ్‌సైట్‌లో ఉంచామని ఆ శాఖ ఏడీ అర్చన తెలిపారు. ఈ పోస్టులను ఈనెల 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్‌ నెంబర్‌ : 08592-281310 ను సంప్రదించాలని ఆమె కోరారు. 

Updated Date - 2021-03-07T06:58:20+05:30 IST